: డ్రాగా ముగిసిన ఎనిమిదో గేమ్
విశ్వనాథన్ ఆనంద్, కార్ల్ సన్ మధ్య జరుగుతున్న ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో ఎనిమిదో గేమ్ నేడు చెన్నైలో జరిగింది. ఈ గేమ్ కూడా డ్రాగా ముగిసింది. మొత్తం 12 గేములు జరిగే ఈ టోర్నీలో ఆనంద్ 2.5-4.5 స్కోరుతో వెనుకబడ్డాడు. రెండు గేములు గెలిచిన కార్ల్ సన్ ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. ఇంకా నాలుగు గేములు మిగిలి ఉండడంతో పోరు మరింత ఉత్కంఠగా సాగుతుందని నిపుణులు చెబుతున్నారు.