: అసెంబ్లీకి నెలాఖరు కల్లా తెలంగాణ బిల్లు: బొత్స
తెలంగాణ బిల్లు నెలాఖరుకల్లా అసెంబ్లీకి వస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ తనకు తెలిపారని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ రచ్చబండ గ్రామాల్లో నిర్వహించాలని తాము అనుకున్నామని, కానీ మండల కేంద్రాల్లో నిర్వహించాలని సీఎం నిర్ణయించారని అన్నారు. సీఎం కార్యాలయానికి, మంత్రి బాలరాజుకు మధ్య సమాచారలోపం ఉందని బొత్స అభిప్రాయపడ్డారు.