: సుప్రీంకోర్టు మందలించినా ప్రభుత్వం మేల్కోవడం లేదు: మోడీ
రాజస్థాన్ ప్రభుత్వంపై బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజస్థాన్ ఆల్వార్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గత 55 నెలలుగా ప్రభుత్వం నిద్రపోతోందన్నారు. ఎందుకు ఇలా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని నిలదీశారు. సాక్షాత్తూ సుప్రీంకోర్టు మందలించినా మీలో ఎందుకు చలనం రావడం లేదు? అని ఆయన ప్రశ్నించారు. అవినీతి, కుంభకోణాలు, నేర చరితులను రాజకీయనాయకులుగా ప్రోత్సహించడంలో గెహ్లాట్ కు ఉన్న శ్రద్ధ, రాజస్థాన్ రోడ్లపై ఏమాత్రం లేదని ఎద్దేవా చేశారు. ఇన్ని లోపాలు పెట్టుకుని అభివృద్ధిలో గుజరాత్ తో ఎలా పోలుస్తారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీజేపీని గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.