: జర్మనీ ఛాన్సెలర్ కి ఇందిరాగాంధీ శాంతి బహుమతి


జర్మనీ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్ ఈ సంవత్సరం ఇందిరాగాంధీ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. నిరాయుధీకరణ, అభివృద్ధి రంగాల్లో ఆమె చేసిన కృషికి గాను భారత ప్రధాని ఆధ్వర్యంలోని జ్యూరీ ఆమెను ఆ అవార్డుకు ఎంపిక చేసింది. ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్టు ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. జర్మనీ మహిళా ఛాన్సెలర్ అయిన మెర్కెల్ యూరోపియన్ యూనియన్ నాయకురాలిగాను, జర్మనీ ఆర్థికవృద్ధిలో పోషించిన పాత్రను ట్రస్టు కొనియాడింది. ఇండో జర్మన్ ద్వైపాక్షిక సంబంధాల విషయంలో మెర్కెల్ కీలక పాత్ర పోషించారని తెలిపింది.

  • Loading...

More Telugu News