: ముఖ్యమంత్రిని చేస్తే కాదనను: సర్వే
సోనియా గాంధీ ముఖ్యమంత్రి పదవి ఇస్తే కాదనే దమ్ము తనకు లేదని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దళితుడికే ముఖ్యమంత్రి పదవి ఇస్తారని అన్నారు. అయినా సరే తాను సీఎం రేసులో లేనని, సీఎం కావాలనుకుంటే ఎవరూ కాలేరని, సోనియా గాంధీ తలచుకుంటే ఎవరైనా అవుతారని సర్వే స్పష్టం చేశారు. రాష్ట్రాలు విభజించవద్దని ఇందిరాగాంధీ ఎప్పుడూ చెప్పలేదని, సోనియా గాంధీ ప్రజలకిచ్చిన మాటను నెరవేరుస్తున్నారని సర్వే వెల్లడించారు.