: అమెరికాలో కర్నూలు యువకుడి మృతి


అమెరికాలో జరిగిన విమాన ప్రమాదంలో కర్నూలు జిల్లాకు చెందిన యువ శిక్షణ పైలట్ కార్తీక్ మృతి చెందాడు. కర్నూలుకు చెందిన బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ నాగరాజు రెండో కుమారుడు కార్తీక్ ఇటీవల పైలట్ గా శిక్షణ పొందేందుకు అమెరికా వెళ్లాడు. హుక్స్ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవుతుండగా హాంగర్ తగలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కార్తిక్ తో పాటు అతని శిక్షకుడు కూడా మృతి చెందాడు. దీంతో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

  • Loading...

More Telugu News