: విద్యార్థిని అత్యాచారానికి కారణమైన మంత్రి గారి నిర్వాకం


విద్యార్థులకు ఉచిత ల్యాప్ టాప్ ల పథకం ద్వారా లబ్ది చేకూర్చాల్సిన మంత్రిగారి నిర్వాకం విద్యార్థిని అత్యాచారానికి కారణమైంది. ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ లో సోమవారం మధ్యాహ్నం విద్యార్థులకు ఉచిత ల్యాప్ టాప్ లు అందజేసే కార్యక్రమాన్ని ఓ స్కూలులో ఏర్పాటు చేశారు. రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖా మంత్రి అవథేష్ ప్రసాద్ షరా మామూలుగా కార్యక్రమానికి ఎనిమిది గంటలు ఆలస్యంగా వచ్చారు. మంత్రిగారి ప్రాపకం కోసం ఎదురుచూసిన స్కూలు సిబ్బంది, విద్యార్థులను ఇళ్లకు పంపకుండా మంత్రిగారు వచ్చి పంపిణీ చేసే వరకు ఎదురు చూసారు.

దీంతో రాత్రి పదిన్నర తరువాత ల్యాప్ టాప్ తీసుకుని వెళ్తున్న బాలికను స్వగ్రామం విశ్వంభరపట్ కి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ అందిరినీ దించి, బాలికను ఊరు చివర పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దీంతో బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంత్రిగారి నిర్వాకమే దారుణానికి కారణమని విశ్వంభరపట్ గ్రామస్తులు మండిపడుతున్నారు.

  • Loading...

More Telugu News