: కిల్లి కృపారాణి ఫ్లెక్సీలు చించేసిన సమైక్యవాదులు
కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి సమైక్య సెగ తగిలింది. సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో సమైక్యవాదులు ఆమె ఫ్లెక్సీలు చించివేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా శ్రీకాకుళంలో సమైక్యాంధ్ర పరిరక్షణ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.