: సముద్ర దొంగల భరతం పట్టాలని సోమాలియాకు యూఎన్ పిలుపు
సముద్ర దొంగల (పైరేట్లు) ఆటకట్టించాలని సోమాలియా ప్రభుత్వానికి ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఏకగీవ్రంగా పిలుపునిచ్చింది. సోమాలియా తీరంలో పైరేట్లు దాడులకు పాల్పడకుండా నిషేధిస్తూ చట్టం చేయాలని కోరింది. ఈ మేరకు ఒక తీర్మానాన్ని భద్రతామండలి 15-0ఓట్లతో ఏకగ్రీవంగా ఆమోదించింది. పైరేట్లను అరెస్ట్ చేసి జైల్లో వేయాలని సోమాలియాను కోరింది. హిందూ మహసముద్రంలో సోమాలియా తీరంలో పైరేట్లు విదేశీ నౌకలను తమ ఆధీనంలోకి తీసుకోవడం, డబ్బుల వసూళ్లకు పాల్పడడం తెలిసిందే.