: ఛత్తీస్ గఢ్ లో ప్రారంభమయిన తుది విడత పోలింగ్
ఛత్తీస్ గఢ్ లో తుది విడత పోలింగ్ ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 72 అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతుంది. తుది విడతలో 843 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.