: మరో అల్పపీడనం ముప్పు
ఈ నెల 22న దక్షిణ అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గత వారం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తమిళనాడులోని నాగపట్టణం వద్ద తీరం దాటిన సంగతి తెలిసిందే. కాగా ఇది అల్పపీడనంగా మారకుండానే తీరం దాటడంతో వాతావరణ శాఖ ఊపిరి పీల్చుకుంది. అయితే అంతకు ముందు ఫైలిన్ తుపాను ప్రభావంతో ఏర్పడిన అల్పపీడనం ఒడిశా, ఉత్తరాంధ్రలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే.