: జీవోఎంకు ప్రత్యేక నివేదిక ఇచ్చిన పనబాక


ఐదు పేజీలతో కూడిన ప్రత్యేక నివేదికను కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి జీవోఎంకు అందజేశారు. ఈ నివేదికలో ప్రధానంగా సీమాంధ్ర రాజధానిపై ప్రస్తావించారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల మధ్యనున్న... విజయవాడకు 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాన్ని సీమాంధ్రకు రాజధాని చేయాలని ఆమె జీవోఎంను కోరారు. ప్రకాశం జిల్లాలోని వాన్ పిక్ ప్రాంతంలో చమురుశుద్ధి కర్మాగారాన్ని, నెల్లూరు జిల్లా గూడూరు వద్ద ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని పనబాక జీవోఎంకు సూచించారు.

  • Loading...

More Telugu News