: బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం
సూపర్ సోనిక్ క్షిపణి బ్రహ్మోస్ పరీక్ష విజయవంతంగా జరిగింది. రాజస్థాన్ లోని ఫోఖ్రాన్ నుంచి ఈ క్షిపణిని ఈ రోజు ప్రయోగించారు. ఈ క్షిపణి 290 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేధిస్తుందని, 300 కేజీల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగినదని నిపుణులు తెలిపారు. ఈ క్షిపణిని భూ ఉపరితలం నుంచి కానీ, సముద్రంలోంచి కానీ, విమాన వాహక నౌకల నుంచి ప్రయోగించవచ్చని వెల్లడించారు. ఈ సూపర్ సోనికి క్షిపణి అనుకున్న లక్ష్యాన్ని ఛేదించి తన సామర్థ్యాన్ని నిరూపించుకుందని వారు స్పష్టం చేశారు.