: రాష్ట్ర విభజనలో జగన్ భాగస్వామి: యనమల
రాష్ట్ర విభజనలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ భాగస్వామి అని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ రంగులు మార్చడంలో జగన్ ఊసరవెల్లిని మించిపోయాడన్నారు. అర్టికల్ 3 ద్వారా రాష్ట్రాన్ని విభజించమని చెప్పిన జగన్ ఇప్పుడు దాన్ని సవరించాలనడం విడ్డూరంగా ఉందన్నారు. కోర్టు వాయిదాలు ఉన్నప్పుడే వాటిని తప్పించుకోవడానికి జగన్ పర్యటనలు పెట్టుకుంటున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ రాజకీయాల్లో, రాష్ట్ర విభజనలో జగన్ భాగస్వామని యనమల ధ్వజమెత్తారు.