: తెలంగాణను ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేయడం నెహ్రూకి ఇష్టం లేదు: సర్వే


తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేయడానికి నెహ్రూ ఒప్పుకోలేదని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. ఢిల్లీలో జీవోఎంతో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ నెహ్రూతో బాటు, ఫజల్ అలీ కమిషన్ కూడా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటును వ్యతిరేకించిందని అన్నారు. అందుకే నెహ్రూ బలవంతంగా కలుపుతున్నామని అన్నారని కొత్త భాష్యం చెప్పారు. సోనియాగాంధీ సహకారంతో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ఆమోదంతోనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని అన్నారు.

బీజేపీ వారు కూడా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నారని సర్వే తెలిపారు. భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపకూడదని ఆయన ఆకాంక్షించారు. అలాగే హైదరాబాద్ పై ఆంక్షలు విధించరాదని అన్నారు. ఎవరైనా సీమాంధ్రులు తెలంగాణలో ఉంటే వారి రక్షణ తాము చూస్తామని సర్వే సత్యనారాయణ అన్నారు.

  • Loading...

More Telugu News