: మోడీపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
రాహుల్ గాంధీని ఉద్దేశించి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ కు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఫిర్యాదు చేసింది. ఛత్తీస్ గఢ్ కు విరివిగా కేంద్రం నిధులు ఇచ్చామంటూ రాహుల్ చెప్పడాన్ని మోడీ తప్పుబట్టారు. దీనిపై నిన్న ఛత్తీస్ గఢ్ లో జరిగిన ప్రచారంలో మాట్లాడుతూ.. 'ఛత్తీస్ గఢ్ కు ఇచ్చిన కేంద్రం నిధులు మీ మామ ఇంటి నుంచి వచ్చాయా?' అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. కేంద్రం నిధులు పొందడం ప్రజల హక్కు అని, వారేమీ బిచ్చగాళ్లు కాదని పేర్కొన్నారు.