: నేడు రాష్ట్ర విభజనపై పిటిషన్లను విచారించనున్న సుప్రీంకోర్టు


రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వివిధ పార్టీ నేతలు దాఖలు చేసిన కేసులు ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణకు రానున్నాయి. ఈ కేసులను జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ మదన్ బి లోకూర్ లతో కూడిన ధర్మాసనం విచారించనుంది. 2009 డిసెంబర్ 9న ప్రకటన వచ్చినప్పటినుంచి ఇప్పటిదాకా... విభజనను వ్యతిరేకిస్తూ దాఖలైన ఎన్నో కేసులను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చుతూ వచ్చింది. కానీ, ఈ రోజు అత్యంత సీనియర్ లాయర్లు హాజరవుతున్నందున న్యాయస్థానం స్పందిస్తుందని పిటిషనర్లు, నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News