: ఇరు ప్రాంతాల నినాదాలతో మారుమోగిన మైనార్టీ ఉద్యోగుల సమావేశం
రాష్ట్ర విభజన అంశం ముస్లిం ఉద్యోగ వర్గాల్లో చిచ్చు రేపింది. డిమాండ్ల సాధన కోసం అఖిల భారత మైనార్టీ ఉద్యోగుల కల్చరల్ అసోసియేషన్, అల్ మైనార్టీ ఉద్యోగుల సంఘం సంయుక్తంగా హైదరాబాదు, బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సర్వసభ్య సమావేశం నిర్వహించాయి. అయితే ఇందులో పాల్గొన్న ఉద్యోగులు ప్రాంతాల వారీగా విడిపోయి... జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో అక్కడ కొంత సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే, సంఘం నేతలు కల్పించుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు.