: ఫుట్ బాల్ మ్యాచుల్లో ఫిక్సింగ్ భూతం
క్రీడా ప్రపంచం నివ్వెరపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ఫిక్సింగ్ భూతం ఫుట్ బాల్ క్రీడకు మాయని మచ్చని తెచ్చింది. క్రీడా లోకంలోనే అతిపెద్ద కుంభకోణాన్ని యూరో పోల్ బయట పెట్టింది. ముప్పై దేశాలకు చెందిన ఏడు వందల ఫుట్ బాల్ మ్యాచుల్లో ఫిక్సింగ్ జరిగిందని తేలింది. 425 మంది ఆటగాళ్లు, అధికారులు ఫిక్సింగ్ కు పాల్పడ్డట్లు సమాచారం. ఈ ఫిక్సింగులో అగ్రభాగం యూరప్ దేశాలదే. ఫిక్సింగ్ కు పాల్పడ్డ వాళ్లు ఎంత పెద్ద హోదాలో ఉన్నా కఠినంగా శిక్షించనున్నట్లు సమాచారం.