: కేజ్రీవాల్ ఆస్తుల విలువ రూ. 93 లక్షలు


ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన ఆస్తుల విలువ రూ. 93 లక్షలని ప్రకటించారు. నిన్న నామినేషన్ దాఖలు చేసిన కేజ్రీవాల్, అఫిడవిట్ లో తన ఆస్తుల వివరాలను పేర్కొన్నారు. ఇందులో ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లాలో భూమి, హర్యానాలోని కర్నాల్ జిల్లాలో పూర్వీకుల నుంచి సంక్రమించిన వ్యవసాయ భూమి ఉందని తెలిపారు. బ్యాంకు డిపాజిట్లతో పాటు తన వద్ద ఉన్న సొమ్ము రూ. 1.60 లక్షలని వెల్లడించారు. అంతేకాకుండా, రూ. 23,550 ల కరెంట్ బిల్లు బకాయిలు ఉన్నాయని తెలిపారు. 2012-13 ఏడాదికి గాను తన సంపాదన రూ. 2.05 లక్షలని అఫిడవిట్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News