: హోమీబాబాను గౌరవించి ఉంటే దేశాన్ని వీడేవారు కాదు: సీఎన్ఆర్ రావు
హోమీ జహంగీర్ బాబా (హెచ్ జే బాబా) విఖ్యాత భారతీయ శాస్త్రవేత్త. భారత అణుపితామహుడిగా సుపరిచితులు. టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ సైన్స్ వ్యవస్థాపకులు. ఈయన గురించి తాజాగా భారతరత్న పురస్కారానికి ఎంపికైన ప్రముఖ శాస్త్రవేత్త సీఎన్ఆర్ రావు ఒక వ్యాఖ్య చేశారు. 'భారతరత్న రాకుంటే మీరు కూడా దేశాన్ని వీడేవారా?' అంటూ నిన్న బెంగళూరు వచ్చిన సందర్భంగా రావును విలేకరులు ప్రశ్నించారు. భారతరత్న ఇవ్వకపోయినా తాను దేశాన్ని వీడేది లేదని చెబుతూనే.. హోమీబాబాను తనలాగే గౌరవించి ఉంటే ఆయన దేశాన్ని వీడి ఉండేవారు కాదంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తనకొచ్చిన భారతరత్న అవార్డును విద్యార్థులకు అంకితం చేస్తున్నట్లు రావు ప్రకటించారు. పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించి, పూర్తి వసతులు కల్పించాలని ఆయన కోరారు.