: నా వల్ల సల్మాన్ నిరాశకు గురికాలేదు: సోనాక్షిసిన్హా
తన వల్ల బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నిరాశకు గురికాలేదని నటి సోనాక్షి సిన్హా స్పష్టం చేసింది. సల్మాన్ సూచనతో అర్బాజ్ ఒక చిత్రంలో సోనాక్షికి ఆఫర్ ఇవ్వగా అందుకు ఆమె తిరస్కరించిందని, దాంతో సల్మాన్ నిరాశకు గురయ్యారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిని విలేకరులు సోనాక్షి వద్ద ప్రస్తావించగా.. అగ్గిమీద గుగ్గిలమయ్యింది. 'ఒకవేళ నిరాశకు గురైతే ఆయన్నే అడగండి. నన్ను అడగొద్దు' అంటూ బదులిచ్చింది. సల్మాన్ ఏ విషయంలోనూ తన వల్ల నిరాశకు గురికాలేదని, దీనిపై వస్తున్నవన్నీ నిజం కావని స్పష్టం చేసింది.