: శరీరంపై ముడతల్ని ఇలా తగ్గించుకోవచ్చు


కొంత వయసు అయ్యాక శరీరంపై ముడతలు రావడం సహజం. కానీ చిన్న వయసుకే ముఖంపైన వచ్చే ముడతలు మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి వాటిని తగ్గించుకోవడానికి రకరకాల క్రీములను రాసుకోవడం ప్రారంభిస్తారు. దీనివల్ల కొందరికి సైడ్‌ ఎఫెక్టులు కూడా వస్తుంటాయి. మొత్తానికి గందరగోళంగా తయారవుతుంది. అలాకాకుండా ముడతలను తగ్గించుకోవడానికి కొన్ని సూచనలను పాటిస్తే మేలంటున్నారు నిపుణులు.

ఇప్పుడు చలికాలం కాబట్టి చలికి తట్టుకునేందుకు మనం ఎక్కువగా ఎండలో నిలుచుంటాం. దీనివల్ల మన శరీరానికి కావలసిన డి విటమిన్‌ కూడా అందుతుందని మనం అనుకుంటాం. అయితే కొంతసేపటికి అదే సూర్య కిరణాలనుండి అల్ట్రా వయోలెట్‌ కిరణాలు కూడా ఎక్కువగా ప్రసరిస్తాయి. ఇవి మన చర్మంపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. ఫలితంగా శరీరంపై ముడతలు పడే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి సూర్యుడికి ఎదురుగా ఎక్కువసేపు కూర్చోకుండా ఉంటే మంచిది. అలాగే మన ఆహారంలో ఎక్కువగా విటమిన్లు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఎ, సి, ఇ విటమిన్లు ఎక్కువగా ఉండేలా చూడాలి. ఇవి కేవలం చర్మానికే కాకుండా మొత్తం శరీరారోగ్యానికి కూడా ఎంతగానో ఉపకరిస్తాయి. కాబట్టి ఎక్కువ విటమిన్లు మన ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. అలాగే సరైన నిద్ర కూడా మన శరీరానికి అవసరం. రోజుకు కనీసం ఎనిమిది గంటలపాటు నిద్రపోవాలి. ఇలా చేయడం వల్ల మీ చర్మం ముడతలు లేకుండా ఆరోగ్యంగా ఉండడంతోబాటు మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు.

  • Loading...

More Telugu News