: విశాఖ వన్డేకు 20 నుంచి టికెట్ల విక్రయం


ఈ నెల 24న విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో భారత్-వెస్టిండీస్ మధ్య జరుగనున్న రెండో వన్డే(డే నైట్) మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ సాల్మన్ ఆరోగ్య రాజ్ తెలిపారు. ఈ వన్డే మ్యాచ్ కు ఈ నెల 20 నుంచి టికెట్ల విక్రయాలు ప్రారంభిస్తామని ఆయన అన్నారు. మీ సేవా కేంద్రాల ద్వారా అభిమానులు టికెట్లు పొందవచ్చని ఆయన తెలిపారు. టికెట్ల ధరలు పెరిగాయన్న విషయాన్ని అభిమానులు గుర్తించాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News