: 10 లక్షల మందితో మిలియన్ మార్చ్ కు సిద్ధం: అశోక్ బాబు


రాష్ట్రం సమైక్యంగా ఉండగానే తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఆరోపించారు. హైదరాబాద్ మెహదీపట్నంలోని అశోకా గార్డెన్స్ లో నిర్వహించిన సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక సదస్సులో పోలీసులు మైక్ కట్ చేయడంపై ఆయన మండిపడ్డారు. శీతాకాలంలో జరుగనున్న శాసనసభ సమావేశాల సమయంలో, సీమాంధ్రకు చెందిన 10 లక్షల మంది ఉద్యోగులతో హైదరాబాదులో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని తెలిపారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఏర్పడితే సీమాంధ్రులు ప్రత్యేక దారులలో విధులకు వెళ్లాల్సి ఉంటుందేమోనని ఆయన సందేహం వ్యక్తం చేశారు. విభజనపై తమ పోరాటం ఆగలేదని, ఉద్యమ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News