: భారతరత్నకు సచిన్ అర్హుడు: అమీర్ ఖాన్
భారత అత్యున్నత పురస్కారం భారతరత్నకు సచిన్ అర్హుడని బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కొనియాడారు. ముంబైలో ఆయన మాట్లాడుతూ సచిన్ కు భారతరత్న పురస్కారం ప్రకటించడం తనకు సంతోషాన్ని కలిగించిందన్నారు. సచిన్ అంకిత భావమే అతనిని ప్రత్యేక వ్యక్తిగా తయారు చేసిందని అన్నారు. బాలీవుడ్ నటుల్లో అమీర్ ఖాన్ తో సచిన్ కు అనుబంధం ఉంది.