: 20 మంది గిరిజన విద్యార్థినులకు అస్వస్థత
కలుషిత ఆహారం తిని 20 మంది గిరిజన విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల-1లో జరిగింది. కాగా, వీరిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. బాధితురాళ్లకు అనంతగిరి ప్రాథమిక కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు.