: అభిమానులు కేరింతలతో స్ఫూర్తి నింపారు: సచిన్
తన కెరీర్ ఆరంభం నుంచి తనను ప్రతి సందర్భంలో ఎంతో ప్రోత్సహించిన అభిమానులకు సచిన్ టెండూల్కర్ కృతజ్ఞతలు తెలిపారు. తాను ఫాంలో ఉన్నా లేకున్నా భారతీయుల అభిమానంలో మాత్రం మార్పు రాలేదని, తాను స్టేడియంలో దిగిన ప్రతిసారీ తమ కేరింతలతో స్ఫూర్తి నింపారని అన్నారు. అభిమానుల కేరింతలకు ఇకపై తాను దూరమవుతాననీ, అయినప్పటికీ వారి అభిమానాన్ని మాత్రం మరువలేనని సచిన్ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.