: సమైక్యానికి మద్దతివ్వండి : సురవరంను కోరిన జగన్


సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డితో వైకాపా అధ్యక్షుడు జగన్ భేటీ ముగిసింది. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో సమైక్యాంధ్రకు మద్దతు పలకాలని సురవరంను జగన్ కోరారు. ఈ సందర్భంగా ఐదు పేజీల లేఖను సురవరంకు జగన్ అందించారు. ఈ లేఖలో విభజనకు వ్యతిరేకంగా పోరాడుతున్న తమకు సహకరించాలని జగన్ కోరారు. దీనికితోడు విభజించు, పాలించు అన్న సూక్తికి ఆంధ్రప్రదేశ్ వేదిక కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో జగన్ తో పాటు ఎంపీ మేకపాటి, కొణతాల, బాలశౌరి, గట్టు రామచంద్రరావు, మైసూరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News