: సల్మాన్ కు 10కి 10 వేస్తా: కత్రినాకైఫ్
కత్రినాకైఫ్ మళ్లీ మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ కు దగ్గరవుతోందా? ఆ విషయం ఏమో గానీ, కత్రినా సల్మాన్ పై ప్రశంసల జల్లు కురిపించింది. 'షారూక్ ఖాన్ తో నటిస్తున్నప్పుడు ఎందుకో తెలియదు గానీ చాలా భయంగా ఫీలయ్యేదాన్ని.. కానీ సల్మాన్ నన్ను తేలికపరిచాడు. మొదటి నుంచీ నా గురించి సల్మాన్ కు తెలుసు. వ్యక్తిత్వపరంగా సల్మాన్ కు 10 మార్కులకు 10 వేస్తా' అంటూ ధూమ్3 టైటిల్ సాంగ్ విడుదల సందర్భంగా కత్రినాకైఫ్ చెప్పింది. సల్మాన్, కత్రినాకైఫ్ నిజజీవితంలో ఒక్కటవ్వాలని అమీర్ ఖాన్ ఇప్పటికే బహిరంగంగా తన అభిప్రాయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. మరి రణబీర్ కపూర్ ఒప్పుకుంటాడా?