: బాంబు బెదిరింపుతో కృష్ణా ఎక్స్ ప్రెస్ నిలిపివేత
కృష్ణా ఎక్స్ ప్రెస్ లో బాంబు ఉందంటూ వచ్చిన సమాచారంతో రైల్వే అధికారులు పరుగులు పెట్టారు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న కృష్ణా ఎక్స్ ప్రెస్ ను వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. దీంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది.