: కర్ణాటకలో టెంపో బోల్తా : 21 మంది మృతి
కర్ణాటకలోని బెళగామి జిల్లా హళకిలో ఈరోజు ఉదయం టెంపో బోల్తా పడి 21 మంది మృతిచెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో టెంపోలో 35 మంది ఉన్నారు. టెంపోలో ప్రయాణిస్తున్న వారంతా సురాపురా తండాకు చెందిన కార్మికులుగా గుర్తించారు. మృతుల్లో ఎనిమిదేళ్ల లోపు చిన్నారులే ఎక్కువమంది ఉన్నారు.