: హైదరాబాదును యూటీ చేస్తే లాభమేంటో చెప్పాలి: డీకే అరుణ


విభజన నేపథ్యంలో హైదరాబాదును యూటీ చేయాలంటూ సీమాంధ్ర నేతలు చేస్తున్న డిమాండ్ పై మంత్రి డీకే అరుణ స్పందించారు. హైదరాబాదును యూటీ చేస్తే సీమాంధ్రకు కలిగే లాభమేంటో ఆ ప్రాంత నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. యూటీ చేయాలన్న డిమాండ్ లో అర్థమే లేదన్నారు. కాగా, జీవోఎంకు సీఎం ఇచ్చిన నివేదిక ప్రభుత్వ నివేదిక కాదన్నారు.

  • Loading...

More Telugu News