: విద్యుత్ కోతలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం: నారాయణ
వచ్చే బడ్జెట్ సమావేశాల్లో విద్యుత్ సమస్యలే తమ ప్రధాన అజెండా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. విద్యుత్ సమస్యలపై అసెంబ్లీలో సర్కారును నిలదీస్తామని నారాయణ తెలిపారు. ఈ క్రమంలో అన్నిపార్టీల ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆందోళన నిర్వహించాలని నారాయణ సూచించారు.
కాగా, బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు తీర్పుకు చట్టబద్ధత కల్పించాలని ఆయన కోరారు. ఇక కాంగ్రెస్ బతికిబట్ట కట్టాలంటే తెలంగాణపై నిర్ణయం తీసుకోవడమొక్కటే మార్గమని నారాయణ తేల్చిచెప్పారు.