: రాష్ట్ర సమైక్యత కోసం దేనికైనా సిద్ధం: లగడపాటి
విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాష్ట్ర సమైక్యత విషయంలో దేనికీ తగ్గడంలేదు. కృష్ణా జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. సమైక్యత కోసం దేనికైనా సిద్ధమన్నారు. సీమాంధ్రుల పెట్టుబడులన్నీ హైదరాబాదులోనే ఉన్నాయని, మా సొమ్మును దోచుకుంటే చూస్తూ ఊరుకోమన్నారు. సమైక్యత కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నారన్నారు.