: శివరాత్రి సందర్భంగా భద్రత కట్టుదిట్టం చేస్తాం: డీజీపీ
మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేస్తున్నామని డీజీపీ దినేశ్ రెడ్డి వెల్లడించారు. ఉగ్రవాద దాడుల హెచ్చరికల నేపథ్యంలో జంట నగరాల్లో 3500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు డీజీపీ వెల్లడించారు. కాగా, తీవ్రవాద సంస్థలకు చెందిన స్లీపర్ సెల్స్ కొందరు హైదరాబాద్ లో ఉన్నట్టు తమ వద్ద సమాచారం ఉందని ఆయన తెలిపారు. నగరంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న తనిఖీలు భద్రత చర్యల్లో భాగమేనని, ప్రజలు ఆందోళన చెందాల్పిన పనేమీలేదని డీజీపీ పేర్కొన్నారు.