: కాకినాడలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన పళ్లంరాజు


తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను కేంద్రమంత్రి పళ్లంరాజు ప్రారంభించారు. రూ.70 లక్షల రిలయన్స్ సంస్థ నిధులతో అభివృద్ధి చేసిన బోట్ క్లబ్ పార్కును, సమ్మవరం-పండూరు మధ్య రూ.80 లక్షలతో నిర్మించిన వంతెనను కేంద్రమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సమష్టి కృషితో అభివృద్ధి వైపు పయనిస్తోందన్నారు. జేఎన్ టీయూలో రూ.140 కోట్లతో యూజీసీ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. కాకినాడ ఐఐఐటీకి రూ.150 కోట్లతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు ఒప్పందం కుదిరిందని చెప్పారు.

  • Loading...

More Telugu News