: వంద మంది ఎర్రబెల్లిలు వచ్చినా తెలంగాణను తీసుకురాలేరు : సీఎం రమేష్
టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావుపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నిప్పులు చెరిగారు. ఎర్రబెల్లిని చదువు, సంస్కారం లేని వ్యక్తిగా అభివర్ణించారు. అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ప్రాంతాలకు సమన్యాయం చేయకుండా రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని ప్రశ్నించారు. వంద మంది ఎర్రబెల్లిలు వచ్చినా తెలంగాణ రాదని అన్నారు. ఆర్టికల్ 371-డీ పైన పార్టీ అనుమతితోనే సుప్రీంకోర్టులో కేసు వేసినట్టు రమేష్ తెలిపారు.