: స్వరాజ్ పాల్ కు 'దశాబ్దపు అంతర్జాతీయ భారతీయుడు' అవార్డు
ప్రముఖ ప్రవాస భారతీయ వ్యాపారవేత్త, కపారో గ్రూపు అధినేత లార్డ్ స్వరాజ్ పాల్ కు 'దశాబ్దపు అంతర్జాతీయ భారతీయుడు' అవార్డు వరించింది. బ్రిటన్ లో భారత రాయబారి వీరేందర్ ఈ అవార్డును స్వరాజ్ పాల్ కు లండన్ లో ఒక కార్యక్రమం సందర్భంగా ప్రదానం చేశారు. బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న ఇంజనీరింగ్, స్టీల్ కంపెనీ కపారోను లార్డ్ స్వరాజ్ పాల్ ప్రారంభించారు. అమెరికా, బ్రిటన్, భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీలో 10వేల మంది పనిచేస్తున్నారు.