: జైపాల్ రెడ్డితో టీ కాంగ్ నేతల భేటీ
కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. నేటి సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్ నేతలు జీవోఎంను కలవనున్న నేపథ్యంలో కీలక అంశాలపై కేంద్రమంత్రి జైపాల్ రెడ్డితో చర్చిస్తున్నారు. ఈ భేటీలో కేంద్రమంత్రి బలరాం నాయక్, మంత్రులు జానారెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డిలు పాల్గొన్నారు.