: కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే శాసనసభ ముట్టడిస్తాం: హరీష్ రావు
బడ్జెట్ సమావేశాలలోపు జీహెచ్ఎంసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే కార్మికులతో కలిసి శాసనసభను ముట్టడిస్తామని టీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోసం గురువారం హైదరాబాదులో జీహెచ్ఎంసీ కార్మికులు చేపట్టిన 108 రోజుల రిలే దీక్షలను హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కార్మికుల ఇబ్బందులు పడుతుంటే సర్కారు కావాలనే నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు.