: కొలంబోలో కామన్వెల్త్ దేశాల సదస్సు ప్రారంభం
శ్రీలంక రాజధాని కొలంబోలో కామన్వెల్త్ దేశాల సదస్సు ప్రారంభమైంది. 53 దేశాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. మూడు రోజుల పాటు ఈ సదస్సులు జరగనున్నాయి. బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్ ముందుగా ప్రసంగించనున్నారు. భారత్ తరపున విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ పాల్గొంటున్నారు.