: బ్రదర్ అనిల్ మత ప్రబోధకుడా.. రాజకీయ నాయకుడా?: రేవంత్ రెడ్డి
వైఎస్ అల్లుడు బ్రదర్ అనిల్ మతం ముసుగులో రాజకీయాలు నెరుపుతున్నారని టీడీపీ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. బ్రదర్ అనిల్ మత ప్రబోధకుడా.. రాజకీయ నాయకుడా? అంటూ రేవంత్ ప్రశ్నించారు. ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారని రేవంత్ పేర్కొన్నారు.
జగన్, అనిల్ ఇకనైనా వాస్తవాలు వెల్లడిస్తే తక్కువ శిక్ష పడుతుందని ఆయన సలహా ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్ నిజాయతీ పరులని చెబుతున్న విజయమ్మ, షర్మిల ఆ విషయమై బైబిల్ పై ప్రమాణం చేస్తారా? అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.