: ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మిని విచారించేందుకు కేంద్రం అనుమతి


ఓఎంసీ కేసులో మాజీ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని విచారించేందుకు కేంద్రం సీబీఐకి అనుమతి ఇచ్చింది. దీంతో అవినీతి నిరోధక చట్టం అభియోగాలపై ఆమెను న్యాయస్థానంలో విచారించేందుకు సీబీఐకి మార్గం సుగమమైంది.

ఢిల్లీలో సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆరో నిందితురాలైన శ్రీలక్ష్మి ఓఎంసీకి గనుల లీజును కట్టబెట్టడంలో అక్రమాలకు పాల్పడ్డారని గతంలో సీబీఐ కోర్టులో అభియోగం నమోదైంది. శ్రీలక్ష్మిపై నమోదైన అభియోగాలను ఇప్పటికే సీబీఐ కోర్టు స్వీకరించింది. 

  • Loading...

More Telugu News