: ముఖ్యమంత్రి మార్పు ఊహాగానమే : మంత్రి రామచంద్రయ్య
సీఎం కిరణ్ ను మారుస్తారని వస్తున్న వార్తలన్నీ కేవలం ఊహాగానాలేనని మంత్రి రామచంద్రయ్య అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిని మార్చాల్సిన అవసరం ప్రస్తుతానికి లేదని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగపరమైన అడ్డంకులు ఏమైనా వస్తే తప్ప విభజన ప్రక్రియ ఆగేలా లేదని తెలిపారు.