: సచిన్ బౌండరీల రికార్డు.. భారత్ 112/2


సచిన్ టెండూల్కర్ పేరు వింటేనే రికార్డుల మోత మోగుతుంది. తాజాగా వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో సచిన్ మరో రికార్డు సాధించాడు. టెస్టుల్లో అత్యధిక ఫోర్లు 2,048 బాదిన వ్యక్తిగా రికార్డుపుటలకెక్కాడు. 200 టెస్టులు ఆడటం ఓ రికార్డు అయితే, అందులో మరో రికార్డు సృష్టించడం మరో రికార్డు. అభిమానులను అలరిస్తున్న సచిన్ ఇప్పటికి 17 పరుగులు చేయగా టీమిండియా స్కోరు సెంచరీ దాటింది. అంతకు ముందు విండీస్ 182 పరుగులకు ఆలౌట్ కాగా, దీనికి సమాధానంగా ఆడుతున్న భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 112 పరుగులు సాధించింది. ధావన్(33), విజయ్(43)లు పెవిలియన్ చేరగా... సచిన్(17), పుజారా(14) క్రీజులో ఉన్నారు.

  • Loading...

More Telugu News