: ఈ నెల 18న జీవోఎంతో సీఎం భేటీ
రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం)తో నేడు జరగాల్సిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భేటీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నెల 18న జీవోఎంతో ముఖ్యమంత్రి భేటీ కానున్నట్టు సమాచారం. కాగా, అప్పటికి జీవోఎంకు అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు అందే అవకాశం ఉంది. దీంతో, 18వ తేదీ నాటికి సమాచారం అందని అంశాల గురించే సీఎం కిరణ్ ను జీవోఎం ప్రశ్నించే అవకాశముందని సమాచారం.