: బరువు తగ్గాలనుకుంటున్నారా... అయితే జాగ్రత్త


బరువు తగ్గాలని పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటాం. ఆహారంలో మార్పులు చేసుకోవడం, వ్యాయామం చేయడం, ఇలా ఒకటికాదు బోలెడు పద్ధతుల్లో ప్రయత్నాలు చేస్తుంటాం. ముఖ్యంగా మహిళలు బరువు తగ్గాలని తెగ ఆరాటపడుతుంటారు. ఈ నేపథ్యంలో కొందరు బోలెడు డబ్బును వెచ్చించి శస్త్ర చికిత్స చేసుకోవడానికి కూడా సిద్ధపడతారు. ఇలాంటి వాళ్లు తర్వాత జాగ్రత్తగా ఉండాలని పరిశోధకులు చెబుతున్నారు.

బరువు తగ్గడంకోసం ఎక్కువగా ప్రయత్నించే మగువలు తర్వాత భవిష్యత్తులో పలు ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వస్తుందంటున్నారు అధ్యయనకారులు. ఎందుకంటే పిల్లలు పుట్టకముందు అధిక బరువును తగ్గించుకోవాలని శస్త్రచికిత్సలు చేయించుకునే మగువలకు పుట్టే బిడ్డలు నెలలు నిండకుండానే ప్రసవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు బరువు తగ్గాలని శస్త్రచికిత్సలు చేయించుకునే మగువలు తక్కువ బరువున్న బిడ్డలకు జన్మనిస్తారట. అందుకే ఇలాంటి చికిత్సలు చేయించుకునేవారు గర్భం ధరించినప్పుడు మామూలు మహిళలకన్నా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం పరిశోధకులు 1992 నుండి 2009 మధ్య కాలంలో జన్మించిన 2,500 మందికి పైగా శిశువుల తీరుతెన్నులను, తల్లుల వైద్య రికార్డులను అధ్యయనం చేశారు. అనంతరం వీరు ఈ మేరకు నిర్ణయానికి వచ్చారు.

  • Loading...

More Telugu News