: 24 కోట్లకు చేరనున్న దేశ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య


టెక్నాలజీని వినియోగించుకోవడంలో భారత్ ఎప్పుడూ ముందుంటుంది. ఇదే కోవలో ఇంటర్నెట్ ను విరివిగా ఉపయోగిస్తోంది భారత్. ఇదే క్రమంలో వచ్చే ఎనిమిది నెలల్లోగా అంటూ 2014 జూన్ కల్లా దేశంలో ఇంటర్మెట్ వినియోగదారుల సంఖ్య 24కోట్లకు పైగా చేరుకోనుంది. అదే సమయంలో రెండో స్థానంలో ఉన్న అమెరికాను భారత్ అధిగమించవచ్చని భావిస్తున్నారు. మొబైల్స్ లో ఎక్కువగా ఇంటర్నెట్ ను ఉపయోగించడం వల్లే ఈ సంఖ్య ఇన్ని కోట్లకు చేరుకుంటోందని సర్వేలు చెబుతున్నాయి. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎమ్ఏఐ), ఐఎమ్ఆర్ బి ఈ ఏడాదికి నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడైనట్లు తెలిపింది. ప్రస్తుతం 300 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులతో చైనా మొదటి స్థానంలో ఉంది.

  • Loading...

More Telugu News