: హైదరాబాదులో నేటి నుంచి మరోగంట విద్యుత్ కోత
వేసవికాలం పూర్తిగా మొదలవక ముందే హైదరాబాద్ వాసులను విద్యుత్ కోతలు మంట పుట్టిస్తున్నాయి. కొన్ని రోజుల నుంచి 2 గంటలు ఉన్న విద్యుత్ కోతలు నేటి నుంచి పెరుగుతున్నాయి. మరోగంట అదనంగా విద్యుత్ కోత విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో గ్రేటర్ నగరంలో విద్యుత్ కోత రోజుకు 3 గంటలకు పెరగనుంది. రబీ పంటలకు విద్యుత్ డిమాండు పెరిగినందువల్లే కోతలు పెంచక తప్పడం లేదని విద్యుత్ అధికారులు చెప్పారు.